ఏపీ ఎంసెట్ ర్యాంక్ విడుదల చేయడానికి విద్యార్థుల IPE మార్కులు కూడా అవసరం. AP EAPCET ర్యాంక్ కోసం 25% IPE మార్కులు వెయిటేజీ ఉంటుంది. వాటిని ఎలా లెక్కిస్తారో ఇక్కడ తెలుసుకోండి.
IPE వేయిటీజీ ఎంత ?
ఏపీ ఎంసెట్ ర్యాంక్ విడుదల చేయడానికి విద్యార్థులు ఎంసెట్ పరీక్షలో సాధించిన మార్కులను 75% మరియు IPE మార్కులను 25% లెక్కిస్తారు.
IPE అన్ని సబ్జెక్టుల మార్కులు కలుపుతారా?
లేదు, IPE మార్కులుగా కేవలం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మాత్రమే కలుపుతారు. ఇంగ్లీష్, సంస్కృతం లాంటి లాంగ్వేజ్ పేపర్లలో సాధించిన మార్కులను కలపరు.
ఎంసెట్ మొత్తం మార్కులు ఎలా లెక్కించాలి?
[(MPC సబ్జెక్టుల్లో మార్కులు / 600) × 25 ] + [(ఎంసెట్ లో సాధించిన మార్కులు / 160) × 75 ] = మొత్తం ఎంసెట్ మార్కులు
ఎంసెట్ ర్యాంక్ కార్డు విడుదల తేదీ
ఎంసెట్ ఫలితాలు జూన్ 11వ తేదీన విడుదల అయ్యాయి, ర్యాంక్ కార్డు కూడా ఫలితాలతో పాటుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు అధికారికంగా ప్రకటించలేదు, కానీ జూన్ నెల చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.